కుక్కకు రూ. 80 వేలతో విగ్రహం
1 min readపల్లెవెలుగువెబ్ : తమిళనాడులోని శివగంగ జిల్లా మనమధురై పట్టణంలో ఆసక్తికర ఘటన వెలుగుచూసింది. మన మధురై పట్టణానికి చెందిన ముత్తు అనే 82 ఏళ్ల వ్యక్తి రిటైర్డు ప్రభుత్వ ఉద్యోగి. ముత్తు ఓ శునకాన్ని అల్లారుముద్ధుగా పెంచుకొని దానికి టామ్ అని పేరు పెట్టాడు.2010వ సంవత్సరం నుంచి పెంచుకుంటున్న శునకమైన టామ్ 2021లో మరణించింది. దీంతో ముత్తు తన పెంపుడు కుక్కపై ఉన్న ప్రేమతో రూ.80వేలు ఖర్చు చేసి టామ్ పాలరాతి విగ్రహాన్ని తయారు చేయించాడు.కుక్క విగ్రహానికి ప్రతీరోజు పూల మాల వేసి, నైవేద్యం సమర్పిస్తున్నామని ముత్తు కుమారుడు మనోజ్ కుమార్ చెప్పారు.