చదివిన కాలేజీకి.. రూ. 100 కోట్ల విరాళం !
1 min readపల్లెవెలుగువెబ్ : చదివిన కాలేజీ రుణం తీర్చుకున్నారు రాకేశ్ గంగ్వాల్. ఇండిగో కో ఫౌండర్ అయిన రాకేశ్ గంగ్వాల్ తోటి వ్యాపారవేత్తలకు ఆదర్శంగా నిలిచే నిర్ణయం తీసుకున్నారు. తాను చదివిన ఐఐటీ కాన్పూరు కాలేజీకి రూ. 100 కోట్ల భూరి విరాళం ప్రకటించారు. ఈ డబ్బుతో ఐఐటీ కాన్పూరులో స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీని ప్రారంభించనున్నారు. రికార్డు స్థాయిలో రాకేశ్ గంగ్వాల్ ఏకంగా వంద కోట్ల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. రాకేశ్ గంగ్వాల్ అందించిన నిధులతో 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించనున్నారు. దీనికి గంగ్వాల్ స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీగా పేరు పెట్టనున్నారు.