PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్టాక్ మార్కెట్.. టాప్ లో తెలుగువారు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : స‌్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తున్న‌వారిలో ద‌క్షిణాదిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ టాప్ లో ఉంది. దేశ సగటు కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికంగా స్టాక్‌ మార్కెట్‌లో ఖాతాలు ఉన్నట్లు స్టాట్స్‌ ఆఫ్‌ ఇండియా తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర జనాభాలో 8.8 శాతం మంది బొంబే స్టాక్‌ ఎక్సే్ఛంజీ(బీఎస్‌ఈ)లో మదుపుదారుగా నమోదయి ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ప్రతీ 100 మందిలో 8.8 శాతం మంది బీఎస్‌ఈ ద్వారా స్టాక్‌ మార్కెట్లో మదుపు చేస్తున్నారు. ఇదే సమయంలో తెలంగాణాలో 8.2 శాతం, కర్నాటకలో 8.7 శాతం, తమిళనాడులో 7.0 శాతం, పుదిచ్చేరిలో 6 శాతం ఉండగా కేరళలో 7 శాతంగా ఉంది. అంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రా నుంచే అత్యధికంగా స్టాక్‌ మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. దేశం మొత్తం మీద చూస్తే 7.4 శాతం మంది మాత్రమే స్టాక్‌ మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేస్తుండగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి మాత్రం 8.8 శాతం మంది ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. అయితే ఢిల్లీ 23.6 శాతంతో దేశంలో మొదటి స్థానంలో ఉండగా, మహారాష్ట్ర 16.6 శాతం, గుజరాత్‌ 15.5 శాతంతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

                                  

About Author