సంచలనం.. ఆ యూట్యూబ్ ఛానెళ్లపై నిషేధం !
1 min readపల్లెవెలుగువెబ్ : కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. యూట్యూబ్ ద్వారా ప్రసారమవుతున్న 22 న్యూస్ చానెళ్లపై కేంద్రం నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. భారత్‌కు చెందిన 18 చానెళ్లు.. పాకిస్థాన్‌కు చెందిన 4 చానెళ్లు, మూడు ట్విటర్ ఖాతాలు, ఒక ఫేస్‌బుక్ ఖాతా, ఒక వార్తల వెబ్‌సైట్‌ను సోమవారం నుంచి నిషేధించామని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇ వన్నీ తప్పుడు వార్తల్ని వ్యాప్తి చేస్తున్నాయని, వీటి వ లన జాతీయ భద్రతకు, విదేశీ బంధాలకు, శాంతిభద్రతకు విఘాతం ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. కాగా.. గత ఏడాది ఫిబ్రవరిలో కొత్త ఐటీ చట్టాలను తీసుకొచ్చిన తర్వాత ప్రభుత్వం ఆన్‌లైన్ చానెళ్లపై చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి.