NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఊపందుకున్న ఉద్యోగ నియామ‌కాలు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఐటీ రంగంలో ఉద్యోగ నియామ‌కాలు ఊపందుకున్నాయి. క‌రోన వైర‌స్ తీవ్ర‌త త‌గ్గ‌డం, ఆర్థిక కార్య‌క‌లాపాలు సానుకూలంగా ఉండ‌టం, ఎగుమ‌తుల‌కు డిమాండ్ కార‌ణంగా ఐటీ రంగంలో ఉద్యోగ నియామకాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ఐటీ తో పాటు ఇతర రంగాల్లో కంపెనీలు నియామకాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో తాము ఉద్యోగులను నియమించుకోనున్నట్టు 54% కంపెనీలు తెలిపాయి. ఇది అంతకుముందు త్రైమాసికంతో పోలి స్తే 4% అధికమని టీమ్‌లీజ్‌ సంస్థ తెలిపింది. ఈ సంస్థ ఏప్రిల్‌–జూన్‌ కాలానికి ‘టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ ఎంప్లాయ్‌మెంట్‌ అవుట్‌లుక్‌ రిపోర్ట్‌’ను విడుదల చేసింది. దీని ప్రకారం.. కంపెనీలు రెండంకెల వృద్ధి ని అంచనా వేస్తున్నాయి. దీంతో రానున్న రోజుల్లో ఉద్యోగులను పెద్ద ఎత్తున నియమించుకునే ధోరణిలో ఉన్నాయి.

                                                            

About Author