PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సామాన్య విద్యార్థులతో అసామాన్య ఫలితాలు సాధించడం.. మురళి కోచింగ్ సెంటర్ కే సాధ్యం

1 min read

పల్లెవెలుగు రాయచోటి అన్నమయ్య జిల్లా : రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతమైన రాయచోటి పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన సామాన్య విద్యార్థులతో మురళి కోచింగ్ సెంటర్ అసామాన్య ఫలితాలను సాధించడం అరుదైన విషయమని టీటీడీ పాలక మండలి మాజీ సభ్యులు,నియోజకవర్గ టిడిపి నాయకులు సుగవాసి ప్రసాద్ బాబు అన్నారు.సోమవారం రాత్రి పట్టణంలోని కొత్తపేటలో గల మురళి సైనిక్ అండ్ నవోదయ కోచింగ్ సెంటర్ లో ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ప్రవేశానికి అర్హత సాధించిన విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రసాద్ బాబు మాట్లాడుతూ సాధారణంగా ప్రధాన నగరాలలో ఇలాంటి కోచింగ్ సెంటర్లు రాణిస్తాయన్నారు. అయితే దూర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు కోరికమేరకు రాయచోటి పట్టణంలోని సామాన్యమైన విద్యార్థులకు శిక్షణనిస్తూ గత ఐదు సంవత్సరాలుగా కోచింగ్ నడుపుతూ మొదటి ప్రయత్నంలోనే ఒక్క విద్యార్థితో ఫలితాలు ప్రారంభించి ఏడాదికి ఏడాదికి ఫలితాలను పెంచుకుంటూ 3,6,11,23,21 ఇలా సైనిక్ సీట్లను సాధిస్తూ సామాన్య విద్యార్థుల చేత రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధిస్తున్నారంటే మురళి కోచింగ్ సెంటర్ యాజమాన్యం,ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉందన్నారు.

రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కొండూరు శ్రీనివాసరాజు మాట్లాడుతూ విద్యార్థులు పెద్దలను,తల్లిదండ్రులను,గురువులను గౌరవిస్తూ క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తే ఖచ్చితంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారన్నారు.ఒకప్పుడు అన్ని తరగతుల విద్యార్థులకు గణితంలో ట్యూషన్ చెబుతూ ఎంతో మంది విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిన మురళి కోచింగ్ సెంటర్ డైరెక్టర్ కొండూరు మురళి మోహన్ రాజు వెనుకబడిన ప్రాంతమైన రాయచోటిలో సైనిక్ అండ్ నవోదయ కోచింగ్ సెంటర్ ను ఏర్పాటు చేసి అనతికాలంలోనే ఎంతోమంది పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ప్రవేశానికి అసాధారణ ఫలితాలు సాధిస్తూ పేద విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందిస్తుండడం హర్షించదగ్గ విషయమన్నారు.మురళి సైనిక్ అండ్ నవోదయ కోచింగ్ సెంటర్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి,తల్లిదండ్రుల సహకారం ఎంతో ఉందన్నారు.

పిఆర్టియు జిల్లా అధ్యక్షులు ఏ.బి రామకృష్ణమరాజు మాట్లాడుతూ రాయచోటి ప్రాంతంలోని పేద విద్యార్థులు వేలకు మించి దూర ప్రాంతాలకు వెళ్లి విద్య పొందేందుకు ఇబ్బందులు పడుతున్న తరుణంలో కొండూరు మురళీ మోహన్ రాజు రాయచోటి పట్టణంలోని 2017 సంవత్సరంలో సైనిక్ నవోదయ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో మట్టిలో దాగి ఉన్న మాణిక్యాలను ఎంతో మందిని వెలికితీసి వారిని ఉన్నత స్థాయికి తీసుకు రావడం గొప్ప విషయమన్నారు.

బహుజన టీచర్స్ అసోసియేషన్(బీటీఏ)జిల్లా అధ్యక్షులు అబ్బవరం హరిబాబు మాట్లాడుతూ దూరప్రాంతాలకు విద్యార్థులు వెళ్ళకుండా రాయచోటి పట్టణంలోనే విద్యార్థుల తల్లిదండ్రుల ఆర్థిక స్తోమతను బట్టి ఇక్కడే నాణ్యమైన విద్యను అందిస్తూ ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ లో తెలుగు రాష్ట్రాల్లో ప్రభంజనం సృష్టిస్తూ అసాధారణ ఫలితాలు సాధిస్తున్న మురళి సైనిక్ అండ్ నవోదయ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ కొండూరు మురళీమోహన్ రాజు పర్యవేక్షణలో తల్లిదండ్రుల సహకారంతో ఉపాధ్యాయ బృందం సమిష్టి కృషి మరువలేనిదన్నారు.అనంతరం 2022-23 విద్యా సంవత్సరానికి గాను ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ పరీక్ష ఫలితాలలో రాష్ట్ర స్థాయి ర్యాంకులతో పాటు సైనిక్ స్కూల్ ప్రవేశానికి అర్హత సాధించిన విద్యార్థులకు మెమెంటోలు అందజేసి అభినందించారు.ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ సరితాదేవి,ప్రిన్సిపల్ ప్రసన్నకుమారి,ఉపాధ్యాయ బృందం,విద్యార్థిని,విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

                       

About Author