వైభవం… శ్రీ వీరభద్రస్వామి కాళికాదేవి రథోత్సవం..
1 min readపల్లెవెలుగు వెబ్: మండల పరిధిలోని కైరుప్పల గ్రామంలో వెలసిన శ్రీ వీరభద్రస్వామి కాళికాదేవి రథోత్సవాన్ని బుధవారం సాయంత్రం అంగరంగ వైభోగంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి కుంకుమార్చన,పంచామృతాభిషేకం,పుష్పాభిషేకం, మహామంగళహారతి,ఆకుపూజ, తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు శ్రీ వీరభద్రస్వామి,కాళికా దేవి విగ్రహాలను పల్లకిలో ఊరేగింపుగా రథోత్సవం వరకు తీసుకువచ్చి రథోత్సవంలో కూర్చోబెట్టి రథోత్సవానికి బలిదానం సమర్పించి,రుద్రహోమం నిర్వహించి జనసంద్రం నడుమ రథోత్సవాన్ని లాగారు. రథోత్సవాని తిలకించేందుకు కారుమంచి,కలపరి,దొడ్డగోండా,చెన్నంపల్లి,అలారు దిన్న,పుప్పలదొడ్డి,యటకళ్ళు, తదితర గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కి మొక్కులు తీర్చుకొని ముడుపులు చెల్లించారు.విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలూరు సీఐ ఆస్పరి ఎస్ఐ వరప్రసాద్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తిమ్మక్క,ఎంపీటీసీ లక్ష్మి,మార్కెట్ యార్డ్ డైరెక్టర్ బీటెక్ వీరబద్రి, మాజీ ఎంపిటిసి రవీంద్ర,వైసిపి నాయకులు లక్ష్మన్న, అంగడి వీరభద్రప్ప,అంగడి వీరేష్,సిపిఐ మండల కార్యదర్శి విరుపాక్షి,ఈరన్న,విరేష్,ముద్దురంగన్న, ఎర్రస్వామి,మల్లికార్జున, బంట్రోతు వీరేశ్,బంట్రోతు శ్రీనివాస్,మాజీ సర్పంచ్ శరవన్న, ఉరుకుందప్ప,తదితరులు పాల్గొన్నారు.