PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రూ. 1000 కోట్ల వైపుగా ఆర్ఆర్ఆర్ చిత్రం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి మలిచిన పాన్ ఇండియా చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 900 కోట్లకు పైగానే వసూళ్ళు నమోదు చేసిన ఈ సినిమా త్వరలోనే రూ. 1000 కోట్ల బెంచ్ మార్కును టచ్ చేయబోతోంది. బాలీవుడ్‌లో స్ట్రైట్ మూవీస్ ను సైతం తొక్కుకుంటూ.. ముందు నుంచీ రికార్డ్ వసూళ్ళు నమోదు చేసిన ఈ సినిమా ఇప్పటి వరకూ దాదాపు రూ. 200 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. బాలీవుడ్ లో ఆ స్థాయిలో వసూళ్ళురాబట్టి తొలి తెలుగు చిత్రంగా తన ప్రత్యేకతను చాటుకుంది ‘ఆర్.ఆర్.ఆర్’. లాంగ్‌రన్ లో ఈ సినిమా రూ. 300 కోట్ల వసూళ్ళను అందుకొనే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు.

                                    

About Author