తలుచుకుంటే ప్రభుత్వం అప్పుడే పడిపోయేది !
1 min readపల్లెవెలుగువెబ్ : తెలంగాణ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తలుచుకుంటే ప్రభుత్వం పడిపోయేదని అన్నారు. ‘‘అసెంబ్లీలో ప్రసంగం చేయకపోయినప్పటికీ శాసనసభ సమావేశం కావడానికి గవర్నర్ అనుమతించాల్సి ఉంటుంది. ఆరు నెలలపాటు సమావేశం కాకపోతే అసెంబ్లీ రద్దవుతుంది. చివరిసారిగా గత ఏడాది సెప్టెంబరులో అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. దాదాపు 5 నెలల రెండు వారాల వ్యవధి తర్వాత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి అనుమతి కోరుతూ వచ్చిన ఫైలును మరో 15 రోజులపాటు పెండింగ్‌లో పెడితే రాజ్యాంగ నిబంధనల మేరకు అసెంబ్లీ రద్దయ్యేది. నేను అనుమతి ఇవ్వబోనని అందరూ అనుకున్నారు. కానీ, నేను అలా చేయలేదు. అలా చేస్తే ప్రభుత్వం అప్పుడే రద్దయ్యేది’’ అని గవర్నర్ తమిళిసై వ్యాఖ్యానించారు. ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టడం తనకు ఇష్టం లేదని తెలిపారు. గతంలో వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇలా చేసిందని, దానిని తాను సమర్థించబోనని చెప్పారు.