ఒకవైపు పరీక్షలు.. అదే సమయంలో సోషల్ మీడియాలో ప్రశ్నాపత్రం !
1 min readపల్లెవెలుగువెబ్ : గుజరాత్ లో వింతఘటన చోటు చేసుకుంది. శనివారం ఒకవైపు విద్యార్థులు పదవ తరగతి హిందీ పరీక్ష రాస్తుండగా.. అదే ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈసారి ప్రశ్నాపత్రమే కాకుండా అందులో కొన్నింటికి జవాబులు కూడా రాసి ఉండడం గమనార్హం. ప్రశ్నాపత్రం లీకేజీపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని గుజరాత్ విద్యాశాఖ తెలిపింది. ప్రశ్నాపత్రం లీక్ అంశాన్ని లేవనెత్తుతూ ప్రభుత్వంపై విపక్షాలు మండిపడుతున్నాయి. రాష్ట్రంలో పేపర్ లీకేజీ ఘటనలు తరుచూ జరుగుతున్నాయని, వీటన్నింటికీ బాధ్యత వహిస్తూ గుజరాత్ విద్యాశాఖ మంత్రి జితు వాఘని రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ‘‘ఇంతకు ముందు కేవలం ప్రవేశ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు మాత్రమే లీకయ్యేవి. ఇప్పుడు 10 వ తరగతి బోర్డ్ పరీక్షాపత్రాలు కూడా అందులో చేరుతున్నాయి. ఇది పూర్తిగా ప్రభుత్వ తప్పిదమే’’ అని కాంగ్రెస్ నేతలు అన్నారు.