PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వారికి మ‌ళ్లీ మంత్రులుగా అవ‌కాశం

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కొత్త కేబినెట్‎లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రాధాన్యం ఇచ్చామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. రాజకీయ సాధికారిత దిశగా జగన్ అడుగులు వేస్తున్నారన్నారు. గతంలో చంద్రబాబు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 45 శాతం పదవులు ఇచ్చారని, ఇప్పుడు 65 శాతం ఇస్తున్నామని ఆయన తెలిపారు. సామజిక న్యాయం చేసేందుకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్ద వేశామని చెప్పారు. ఐదేళ్లలో రెండు సార్లు కేబినెట్ విస్తరణ చేయడం రాష్ట్ర చరిత్రలో ఇది తొలిసారి అని సజ్జల పేర్కొన్నారు. పాత కేబినెట్ లోని 11 మందికి మళ్లీ అవకాశం కల్పించనట్లు ఆయన తెలిపారు.

                               

About Author