PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

500 ట‌న్నుల ఇనుప వంతెన ఎత్తుకెళ్లిన దొంగ‌లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బిహార్‌లోని దొంగలు ఏకంగా 500టన్నుల బరువున్న ఓ ఇనుప వంతెనను ఎత్తుకెళ్లిపోయారు. అధికారుల్లా వచ్చి వారధిని పట్టపగలే చుట్టబెట్టేసి పట్టుకుపోయారు. పక్కాప్లాన్‌తో వచ్చిన చోరులు.. స్థానికుల ముందే పని ముగించుకెళ్లారు. 1972లో రోహ్‌తాహ్‌ జిల్లాలోని అమియావర్‌ గ్రామంలో ఆరా నదిపై 60అడుగుల పొడవు, 12 అడుగుల ఎత్తుతో ఓ వంతెనను నిర్మించారు. అయితే, ఆ వంతెన శిథిలావస్థకు చేరుకోవడంతో.. చాలాకాలం నుంచి వాడుకలో లేదు. దీనికి బదులుగా కాంక్రీటు వంతెన నిర్మించారు. ఓ దొంగల ముఠా పాత వంతెన ఇనుముపై కన్నేసింది. ఇంకేముంది.. ఎర్త్‌మూవర్‌ యంత్రం, గ్యాస్‌ కట్టర్లు వంటి సరంజామాతో గ్రామంలోకి దొంగలు వచ్చారు. నీటిపారుదల శాఖ సిబ్బందిమంటూ పరిచయం చేసుకొన్నారు. ప్రమాదకర స్థితిలో ఉన్న వంతెనను తొలగించాలంటూ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలున్నాయని చెప్పారు. యంత్రంతో బ్రిడ్జిని కూల్చేసి.. గ్యాస్‌ కట్టర్లతో వంతెనను భాగాలుగా కత్తిరించి.. ఇనుప రద్దును వ్యాన్‌లో వేసుకొని ఉడాయించారు.

                                          

About Author