వాడవాడలా శ్రీరామనవమి ఉత్సవాలు
1 min readపల్లెవెలుగు వెబ్, ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరంలో వాడవాడలా శ్రీరామనవమి మహోత్సవ ఉత్సవాలు ఘనంగా జరిగాయి,గత నలభై సంవత్సరాలుగా ఏలూరు న్యూ ఫిష్ మార్కెట్ లో ఫిష్ మార్కెట్ సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు అదేవిధంగా 41వ శ్రీరామనవమి ఉత్సవాలను నగర ప్రముఖులతో ప్రారంభించారు,అదేవిధంగా అమీనా పేట ఎలక్ట్రికల్ సబ్ డివిజన్ పరిధిలో ఎలక్ట్రికల్ ఉద్యోగులు సంఘంగా ఏర్పడి శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు అదే విధంగా ఈ సంవత్సరం కూడా కమిటీ సభ్యులు ఉత్సవాలను నిర్వహిస్తూ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వేలాదిగా భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు(పానకం)మరియు అన్నప్రసాదాన్ని స్వీకరించారు, దానిలో భాగంగా అమీనా పేట ఏటిగట్టు ప్రాంతంలో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ కమిటీ మరియు రజక సంఘం ఆధ్వర్యంలో 31శ్రీరామనవమి ఉత్సవాలను స్థానిక పెద్దలతో శ్రీరామ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు,విచ్చేసిన భక్తులకు బాటసారులకు తీర్థప్రసాదాలు అందించి ఎవరికీ ఏ ఇబ్బంది కలక్కుండా కమిటీ వారు చలువ పందిరిలో కుర్చీలు ఏర్పాటుచేసి స్వామివారి కళ్యాణం నిర్వహించారు,21వ తేదీ గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు,ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఎలమంచిలి శేషు, ఉపాధ్యక్షులు సుందరనిడి నాగ వెంకట గంగాధర్ మరియు కమిటీ నెంబర్లు ఏలూరు పాపారావు,గొల్లపల్లి శ్రీనివాస్, అదపాక పార్థసారథి,ఆరేటి వెంకట శివ ప్రసాద్, ఆరేనేపల్లి రవి తదితరులు పాల్గొన్నారు.