కరోన సోకితే.. పిల్లలు పుట్టరా ?
1 min readపల్లెవెలుగువెబ్ : కొవిడ్ సోకిన పురుషుల్లో సంతానోత్పత్తి తగ్గుతుందని పరిశోధకులు ఓ అధ్యయనంలో వెల్లడించారు. ఐఐటీ బొంబాయి పరిశోధకులు కరోనా బారిన పడి కోలుకున్న పురుషులపై ఓ రీసెర్చ్ చేశారు. ఇందులో భాగంగా కొవిడ్ సోకిన పురుషుల్లో సంతానోత్పత్తి తగ్గుతుందని వారి అధ్యయనంలో తేలింది. స్వల్ప లక్షణాలతో అనారోగ్యానికి గురైన వారిలోనూ సంతానోత్పత్తికి సంబంధించిన ప్రోటీన్లు దెబ్బతింటున్నాయని వారు తెలుసుకున్నారు. కాగా, పురుషుల వీర్యకణాలపై చేసిన ఈ పరిశోధనను.. ఏసీఎస్ ఒమెగా జర్నల్ గత వారం ప్రచురించింది. ఈ అధ్యయనాన్ని ఐఐటీ బొంబాయితో కలిసి జస్లోక్ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ పరిశోధకులు సంయుక్తంగా నిర్వహించారు.