రామనామమే… హిందువులకు రక్ష
1 min read– స్వామి సుప్రేమానంద
పల్లెవెలుగు వెబ్, బనగానపల్లె : రామనామమే.. హిందువులకు శ్రీరామ రక్ష అని, అదే దేశభక్తిగా భావించాలని చిన్మయ మిషన్ స్వామి సుప్రేమానంద అన్నారు. శనివారం పట్టణంలోని పురవీధుల్లో శ్రీరామ భక్త బృందం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, జీఎంఆర్ పంక్షన్ హాల్లో సమావేశం జరిగింది. శ్రీరాముని జన్మభూమి అయోధ్య నగరంలో ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న భవ్య శ్రీ రామ మందిరం నిర్మాణం కొరకు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఇచ్చిన పిలుపు మేరకు బనగానపల్లె మండలంలో నిధి సేకరించి సమర్పించిన శ్రీరామ భక్తులతో సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. పట్టణ సీనియర్ న్యాయవాది టి మాధవరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో చిన్మయ మిషన్ ప్రచారక్ స్వామిని సూప్రేమానంద మాట్లాడారు. ప్రతి ఒక్క హిందువు భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని హిందూభావజాలాన్ని పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో భగవద్గీత ప్రచారకులు రామశేషయ్య వికాస భారతి, వ్యవస్థాపకులు నాగేంద్రప్రసాద్, ఆర్ఎస్ఎస్ కార్యవాహక్ మనోహర్జీ , సమరసత సేవా ఫౌండేషన్, రాయలసీమ ధర్మప్రచారక్ ఈశ్వరరెడ్డి, విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు విష్ణువర్ధనరెడ్డి,ఆర్.యస్.యస్. విభాగ ప్రచారక్ సురేంద్రబాబు, సమరసత సేవా ఫౌండేషన్ జిల్లా సహకన్వీనర్ టి మాధవరెడ్డి, పట్టణానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త , బిజెపి జిల్లా నాయకుడు ఆయిల్ శ్రీనివాసులు, మండల గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు డి వెంకటసుబ్బయ్య తదితులు పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన రామభక్తులకు పట్టణ ప్రముఖ పారిశ్రామివేత్త, బిజెపి నాయకుడు ముత్తుకూరు శ్రీనివాసులు ఆయన సతీమణి ఎమ్ ప్రమిలదేవిలు అన్నదాన వితరణగావించారు.