ఐఏఎస్ శ్రీలక్ష్మికి షాక్ !
1 min readపల్లెవెలుగువెబ్ : శ్రీలక్ష్మి రివ్యూ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. దీంతో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి షాక్ తగిలినట్టయింది. హైకోర్ట్ తీర్పును అమలు చేయనందుకు సేవా శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. విద్యాలయ ప్రాంగణాల్లో ఆర్‌బీకేలు.. గ్రామ సచివాలయాల నిర్మాణం చేయవద్దని హైకోర్టు తీర్పు ఇచ్చింది. తీర్పును అమలు చేయకపోవడంతో కోర్టు ధిక్కార చర్యల్లో భాగంగా ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులకు హైకోర్టు రెండు వారాల జైలుశిక్ష విధించింది.