ఏపీలో ఇంగ్లీషు మీడియం బోధన ఎప్పటి నుంచి అంటే ?
1 min readపల్లెవెలుగువెబ్ : ఈ ఏడాది జూలై నుంచి ప్రారంభమయ్యే నూతన విద్యాసంవత్సరంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో 8వ తరగతి విద్యార్థులకు ఆంగ్లంలోనే పాఠ్యాంశాలను బోధించాలని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. ఈ మేరకు విద్యాశాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 1,310 పాఠశాలలకు సీబీఎ్‌సఈ అఫిలియేషన్ పూర్తిచేశామని తెలిపారు. దీంతో హైస్కూల్, హైస్కూల్ ప్లస్ పాఠశాలల్లో సీబీఎ్‌సఈ సిలబ్‌సను అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం నిర్దేశించారు. అదేవిధంగా నూతన విద్యావిధానానికి అనుగుణంగా రాష్ట్రంలో పాఠశాలలు, తరగతుల విలీనానికి మ్యాపింగ్ పూర్తి చేసి వాటిని ప్రారంభించాలని, విలీనం తర్వాత తగినన్ని తరగతి గదులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు.