ఒకే సమయంలో సూర్యాస్తమయం, చంద్రోదయం.. ఎక్కడంటే ?
1 min readపల్లెవెలుగువెబ్ : ఈ నెల 16వ తేదీన చైత్ర పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. ఆ రోజున కన్యాకుమారిలో ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఒకే సమయంలో సూర్యస్తమయం, చంద్రోదయ దృశ్యాలు కనిపించనున్నాయి. ఈ అద్భుత దృశ్యం కన్యాకుమారితో పాటు ఆఫ్రికా దేశంలోని ఒక కొండ ప్రాంతంలో మాత్రమే కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే, ఆ అపురూప దృశ్యాన్ని తిలకించేందుకు ఆఫ్రికాలోని ఆ కొండ ప్రాంతానికి ఎవ్వరూ వెళ్లలేని పరిస్థితి. దీంతో ఒక్క కన్నియాకుమారిలోనే ఈ అరుదైన దృశ్యం చూసేందుకు వీలవుతుంది. దీంతో పలు రాష్ట్రాల నుంచి భక్తులు కన్యాకుమారికి భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. వాస్తవానికి కన్యాకుమారి తీరంలో సూర్యోదయం, సూర్యాస్తమయం రెండూ చూడగలం. ఇప్పుడు సూర్యాస్తమయం, చంద్రోదయం కూడా ఒకే సమయంలో సాక్షాత్కరించనున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.