పెళ్లితో ఒక్కటైన రణ్ బీర్, అలియా భట్
1 min readపల్లెవెలుగువెబ్ : బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ రణ్‌బీర్ కపూర్, ఆలియాభట్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గురువారం మధ్యాహ్నాం వీరిద్దరు ఏడడుగులు వేశారు. బాంద్రాలోని వాస్తు హోమ్‌లో ఇరు కుటుంబాలు, కొద్దిమంది అతిథుల సమక్షంలో ఆలియా–రణ్‌బీర్ వివాహం వైభంగా జరిగింది. పెళ్లి ఫొటోలను ఆలియా ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. ‘‘గత ఐదేళ్లుగా మేం ఏ బాల్కనీలో ప్రేమించుకున్నామో అక్కడే మా వివాహం జరగడం చాలా ఆనందంగా థ్రిల్లింగ్‌గా ఉంది’’ అని అని ఆలియాభట్‌పేర్కొంది. నూతన జంటకు పలువురు సినీ సెలబ్రిటీలు, అభిమానులు వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.