అతిసార బాధితులను పరామర్శించిన మాజీ ఎంపీ
1 min readపల్లెవెలుగు వెబ్, ఆదోని: కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో కలుషితమైన నీరు త్రాగడం వలన అతిసార వ్యాధి గురై అరుణ్ జ్యోతి నగర్ లో వెల్ నెస్ సెంటర్లో చికిత్స పొందుతున్న బాధితులను మాజీ ఎంపీ శ బుట్టా రేణుక, ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పరామర్శించారు. అలాగే భాదితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. పరామర్శించిన వారిలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.