భ్రమరాంబ దేవికి అక్షకుంకుమార్చన
1 min readపల్లెవెలుగు వెబ్: చైత్ర శుద్ధ పౌర్ణమి సందర్భంగా శ్రీశైలం దేవస్థానం నిర్వాహకులు శనివారం లక్షకుంకుమార్చన నిర్వహించారు జ శ్రీ అమ్మవారికి ఈ లక్షకుంకుమార్చనలో భక్తులు పరోక్షసేవగా పాల్గొనే అవకాశం కూడా కల్పించబడింది. లక్షకుంకుమార్చనలో మొత్తం 114 మంది భక్తులు పరోక్షసేవలో పాల్గొన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల వారు కూడా ప్రవాస భారతీయులు కూడా ఈ పరోక్షసేవలో పాల్గొంటున్నారు.. ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజను నిర్వహించారు అనంతరం లక్షకుంకుమార్చన అర్చకులు నిర్వహించారు మంగళకరమైన ద్రవ్యాలలో కుంకుమకు ఎంతో ప్రాధాన్యం ఉందని, ఈ కుంకుమ ద్రవ్యముతో అమ్మవారిని అర్చించడం విశేష ఫలదాయకమని పండితులు పేర్కొంటున్నారు. ఈ లక్షకుంకుమార్చన జరిపించుకోవడం వలన కష్టాలు తొలగిపోతాయని, సర్వశుభాలు కలుగుతాయని, అభీష్టాలు సిద్ధిస్తాయని, సుఖసంతోషాలు సౌఖ్యం కలుగుతుందని, పూర్వజన్మదోషాలు తొలగిపోతాయని పురాణాలు చెప్పబడుతోంది. శ్రీశైలక్షేత్రానికి స్వయంగా విచ్చేయలేని భక్తులు వారి గోత్రనామాలతో ఆయా ఆర్జిత సేవలను పరోక్షంగా జరిపించుకునేందుకు వీలుగా దేవస్థానం ఈ ఆర్జితపరోక్షసేవలను నిర్వహిస్తోంది. ఈ పరోక్షసేవకు భక్తులు ఆన్లైన్ ద్వారా రూ.1,116/-లను సేవారుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. భక్తులుసేవారుసుమును www.srisailadevasthanam.org లేదా aptemples.ap.gov.in ద్వారా చెల్లింపు చేయవచ్చు.