ఇక నుంచి ఒక చోట మాత్రమే ఓటు !
1 min readపల్లెవెలుగువెబ్ : చాలా మంది సొంత ఊర్లతో పాటు, ప్రస్తుతం నివాసం ఉంటున్న పట్టణాల్లో ఓటరుగా నమోదు చేసుకుని ఉంటారు. ఇలా రెండు చోట్ల కొనసాగించాలనుకునే వారికి చెక్ పెట్టేందుకు కేంద్రం ఎన్నికల సంఘం కసరత్తు చేసింది. కొత్తగా రూపొందించిన సాఫ్ట్వేర్ అందుబాటులోకి వచ్చింది. దాని ద్వారా రెండుచోట్ల ఓటరుగా నమోదు చేసుకున్న వారిని గుర్తించి, ఆ బోగస్ ఓట్లను ఏరివేయడంపై కేంద్రం ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. పీఎ్‌సఈ (ఫొటో సిమిలర్ ఎంట్రీస్) సాఫ్ట్‌వేర్‌తో రెండేసి ఓట్లు ఉన్న వారి ముఖాలను గుర్తించి వాటిని తొలగించి, ఒక్క చోట మాత్రమే ఓటు ఉండేలా చర్యలు చేపట్టారు. ఈ సాఫ్ట్‌వేర్‌తో తెలంగాణలో డబుల్ ఓట్లు 2.15 లక్షలకు పైగా ఉన్నట్లు ఎన్నికల సంఘం గుర్తించింది. ఈ జాబితాలను ఈసీఐ ఆయా జిల్లాల కలెక్టర్లు, ఈఆర్వోలకు చేర వేస్తారు. జాబితాలో ఒక చోట మాత్రమే పేరు ఉంచి, మిగతా వాటిని ఈ నెలాఖరు నాటికి తొలగిస్తారు.