హనుమాన్ జయంతి ర్యాలీలో ఘర్షణ
1 min readపల్లెవెలుగువెబ్ : ఢిల్లీలో హనుమాన్ జయంతి ర్యాలీ ఘర్షణకు దారితీసింది. జహంగిర్‌పుర్ ప్రాంతంలో శనివారం రాత్రి జరిగిన హనుమాన్ జయంతి ర్యాలీలో ఘర్షణ చోటుచేసుకుంది. హనుమాన్ జయంతి శోభాయాత్రపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసరడం ఘర్షణకు కారణమైంది. ఈ ఘటనలో రెండు కమ్యూనిటీలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. తొమ్మిది మంది గాయాలపాలయ్యారు. వీరిలో 8 మంది పోలీసులు, ఒక పౌరుడు ఉన్నారు. పరస్పరం రాళ్ల దాడులు, ఘర్షణ కారణంగా వీరికి గాయాలయ్యాయని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. గాయపడ్డ పోలీసుల్లో ఢిల్లీ పోలీస్ సబ్‌ఇన్‌స్పెక్టర్ మేధాలాల్ మీనా ఉన్నారు. ఆయన చేతికి బుల్లెట్ గాయమైంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగానే ఉంది. అస్లాం అనే వ్యక్తి ఈ కాల్పులకు పాల్పడినట్టు భావిస్తున్నారు. ఈ ఘర్షణతో సంబంధమున్న 14 మందిని అరెస్ట్ చేశామని, అరెస్ట్ అయిన వారిలో అస్లాం కూడా ఉన్నాడని పోలీసులు వెల్లడించారు.