ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే 40 లక్షల మంది మృతి !
1 min readపల్లెవెలుగువెబ్ : మోదీ ప్రభుత్వం పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన విమర్శలు చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కరోనా మహమ్మారి సమయంలో 40 లక్షలమంది భారతీయులు చనిపోయారని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని మరోసారి డిమాండ్ చేశారు. ప్రపంచ కొవిడ్ మరణాల సంఖ్యను బహిర్గతం చేయాలనుకుంటున్న డబ్ల్యూహెచ్‌వో ప్రయత్నాలను భారత్ నిలుపుదల చేస్తోందంటూ న్యూయార్క్ టైమ్స్ ఏప్రిల్ 16న ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం స్ర్కీన్ షాట్‌ను రాహుల్ షేర్ చేశారు. ‘‘ ప్రధాని మోడీ ఎప్పుడూ నిజాలు చెప్పరు. ఎవరినీ చెప్పనివ్వరు. ఆక్సిజన్ కొరత కారణంగా ఎవరూ చనిపోలేదని ఇంకా అబద్ధమాడుతున్నారు‘’ అని హిందీలో ట్వీట్ చేశారు. కొవిడ్ సమయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 4 లక్షలు కాదు.. 40 లక్షల మంది చనిపోయారని ఆరోపించారు.