మార్కెట్లో చిన్న సంస్థలదే హవా !
1 min readపల్లెవెలుగువెబ్ : మన దేశ ప్రజల్లో 80 శాతం వినియోగించే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ లో 30,000 బ్రాండ్లు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల నుంచే వస్తున్నాయి. మిగతా 20 శాతం (3,000) మాత్రమే కార్పొరేట్ సంస్థల వాటా అని చిరు వ్యాపారులకు ప్రాతినిధ్యం వహించే సీఏఐటీ సర్వే వెల్లడించింది. ప్రజలు ఎక్కువగా వినియోగించే ఆహార పదార్ధాలు, వంట నూనెలు, చిల్లర వస్తువులు, పర్సనల్ కాస్మెటిక్స్, దుస్తులు, సౌందర్య పోషక వస్తువులు, చెప్పులు, ఆరోగ్య ఉత్పత్తుల వినియోగం ఆధారంగా ఈ సర్వే జరిపింది. సంపన్న, ఎగువ మధ్య తరగతి ప్రజలు మాత్రమే పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థలు ఉత్పత్తి చేసే ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులు వినియోగిస్తున్నట్టు తెలిపింది. మిగతా ప్రజలంతా తక్కువ ధరతో తమకు చిరపరిచితమైన స్థానిక కంపెనీల ఉత్పత్తులపైనే ఆధారపడుతున్నారని సీఏఐటీ తెలిపింది.