కరోన దెబ్బకు కుదేలైన స్టాక్ మార్కెట్
1 min readపల్లె వెలుగు వెబ్: దేశ వ్యాప్తంగా కరోన కేసులు పెరుగుదలతో ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. పలు రాష్ట్రాల్లో పాక్షిక లాక్ డౌన్ విధించే యోచనలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అలర్ట్ పొజిషన్ తీసుకున్నారు. మరోవైపు ఫిబ్రవరి పారిశ్రామికోత్పత్తి లెక్కలు, సిపిఐ ద్రవ్యోల్బణం లెక్కలు.. సోమవారం విడుదలవుతున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో ఆరంభంలోనే మార్కెట్ సూచిలు భారీ గ్యాప్ డౌన్ తో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ- 450 పాయింట్ల దాక పతనం కాగా.. బ్యాంక్ నిఫ్టీ- 1500 పాయింట్ల దాకా దిగజారింది. 10.30 నిమిషాల సమయంలో మార్కెట్లో కొంత స్థిరత్వం కొనసాగుతోంది. అయితే.. మార్కెట్లు ఏ దిశగా మలుపు తీసుకోబోతున్నాయి అనేది.. ఈ రోజు విడుదల కానున్న గణాంకాలు నిర్ధారిస్తాయి. మరోవైపు ఈరోజు టీసీఎస్ కంపెనీ త్రైమాసిక ఫలితాలు పట్ల కూడ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు.
లాభాల్లో ఉన్న స్టాక్స్:
సిప్లా,
రెడ్డీస్ లాబ్స్,
సన్ ఫార్మా,
దివీస్ లాబ్స్ లాభాల్లో ఉన్నాయి. ఫార్మా ఇండెక్స్ లోని కంపెనీలు లాభాల్లో కొనసాగుతున్నాయి.
నష్టాల్లో ఉన్న స్టాక్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్
ఎస్బీఐ
టాటా మోటార్స్
బజాజ్ ఫైనాన్స్
అదానీ మోటార్స్