నలుగురిని కనండి.. ఇద్దరిని ఇవ్వండి !
1 min readపల్లెవెలుగువెబ్ : హిందూ దంపతులు నలుగురు పిల్లలను కనాలని, వారిలో ఇద్దరిని దేశానికి అంకితమివ్వాలని హిందూత్వ నేత, దుర్గా వాహిని వ్యవస్థాపకురాలు సాధ్వీ రిథంబర పిలుపునిచ్చారు. అలా చేస్తే భారతదేశం త్వరలోనే హిందూత్వ రాజ్యమవుతుందన్నారు. దేశ అభివృద్ధిని ఓర్వలేని కొంతమంది ఢిల్లీలోని జహంగిర్‌పురిలో శనివారం హనుమాన్ శోభాయాత్రపై దాడి చేశారన్నారు. రాజకీయ ఉగ్రవాదం ద్వారా హిందూ సమాజాన్ని విభజించాలని చూస్తున్న వారిని మట్టికరిపిస్తామని హెచ్చరించారు. లఖ్‌నవూలోని నీరాల నగర్లో జరిగిన రామ మహోత్సవ కార్యక్రమంలో ఆదివారం రిథంబర మాట్లాడారు.