వెదర్ రిపోర్ట్.. రైతులకు చల్లని కబురు !
1 min readపల్లెవెలుగువెబ్ : ప‌్రతి సంవత్సరం జూన్ నుంచి మొదలయ్యే నైరుతి రుతుపవనాల సీజను ఈ ఏడాది రాష్ట్రంలో సాధారణానికి మించి వర్షాలను కురిపిస్తుందని భారత వాతావరణ విభాగం చెప్పింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది సాధారణ వర్షాలే కురుస్తాయని తాజాగా వెల్లడించినా రాష్ట్రానికి మాత్రం సమృద్ధిగా వానలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. ఈ వార్త ఇటు రైతాంగానికి, ప్రభుత్వానికి ఎంతో ఊరటనిస్తోంది. గడచిన మూడేళ్లుగా రాష్ట్రంలో ఇటు నైరుతి, అటు ఈశాన్య రుతుపవనాలు మంచి వర్షాలే కురిపిస్తున్నాయి. ఫలితంగా పంటల దిగుబడులు ఆశాజనకంగా ఉంటున్నాయి. గత ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో రాష్ట్రంలో సాధారణం కంటే 19 శాతం అధిక వర్షపాతం నమోదైంది.