అక్కడ బైక్ పై ఇద్దరు పురుషులు వెళ్లడం నిషేధం !
1 min readపల్లెవెలుగువెబ్ : ద్విచక్రవాహనంపై వెనుక సీటులో పురుషులు ప్రయాణించడంపై కేరళలో నిషేధం విధించారు. జిల్లా అదనపు కలెక్టర్ ఆదేశాల మేరకు కేరళలోని పాలక్కడ్‌లో ఈ రూల్ అమలులోకి వచ్చింది. కాగా, ఇటీవలే ఆర్ఎస్ఎస్ కార్యకర్త హత్య కేసు నేపథ్యంలో ఈ నిబంధన విధించినట్టు తెలిపారు. తాజా నిషేధం నుంచి మహిళలు, చిన్నారులకు మినహాయింపును ఇచ్చారు. ఈ ఆదేశాలు ఏప్రిల్ 20వరకు అమల్లో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.