సుప్రీం కోర్టులో కరోన డేంజర్ బెల్స్..?
1 min readపల్లెవెలుగు వెబ్: కరోన దాడి దేశ వ్యాప్తంగా తీవ్రమైంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది. ఇప్పుడు సుప్రీం కోర్టులోకి కూడ కరోన ప్రవేశించింది. సుప్రీం కోర్టు సిబ్బందిలో దాదాపు 50 శాతం మంది సిబ్బందికి కరోన పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పలు ఇంగ్లీష్ వార్తా సంస్థలు వెల్లడించాయి. లాయర్ల సిబ్బందికి, సుప్రీం కోర్టు సిబ్బందికి ఒక్కరోజు 40 మందికి పైగా కరోన పాజిటివ్ వచ్చినట్టు సమాచారం. దీంతో వర్చువల్ విధానం ద్వార కేసులు విచారించాలని సుప్రీం కోర్టు వర్గాలు భావిస్తున్నాయని సమాచారం. లా క్లర్కులకు కూడ కరోన సోకిన నేపథ్యంలో ఇంటి వద్దనే విచారించాలని పలువురు న్యాయమూర్తులు అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. కోర్టు పరిసరాలు మొత్తం శానిటైజ్ చేస్తున్నారు. కరోన నిబంధనలు కఠినతరం చేశారు. నేడు పలు బెంచ్ లు 30 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభం కానున్నట్టు సుప్రీం కోర్టు రిజిస్ట్రార్ ఓ ప్రకటనలో తెలిపారు. 10గంటలకు ప్రారంభం కావాల్సిన బెంచ్.. 10:30 నిమిషాలకు, 11 గంటలకు ప్రారంభం కావాల్సిన బెంచ్.. 11:30 నిమిషాలకు ప్రారంభం కానున్నట్టు రిజిస్ట్రార్ తెలిపారు.