PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ల్యాండ్ వివాదంతో నాకు సంబంధం లేదు : టీజీ వెంక‌టేశ్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : హైదరాబాద్ బంజారాహిల్స్ ల్యాండ్ వివాదంతో త‌న‌కు సంబంధం లేదని బీజేపీ ఎంపీ టీజీ వెంక‌టేశ్ అన్నారు. టిజి అనే పేరు ఉన్నంత మాత్రాన టిజి వెంకటేష్ ను వివాదంలోకి లాగడం అవివేకమ‌ని చెప్పారు. త‌మ వంశీయులు ఎందరో టిజి అనే పేరుతో కొనసాగుతున్నారని, వారంద‌రి వివాదాలు త‌న‌కు అంట‌గ‌ట్టొద్ద‌ని హిత‌వు ప‌లికారు. ల్యాండ్ వివాదానికి తనకు సంబంధం లేదని టిజి విశ్వప్రసాద్ క్లారిటీగా చెప్పారని తెలిపారు. హైద‌రాబాద్ ల్యాండ్ వివాదం బయటకు వచ్చినపుడు తాను లక్షద్వీప్ లో ఉన్నానని టీజీ వెంక‌టేశ్ స్ప‌ష్టం చేశారు.

                                       

About Author