కౌలు రైతులకు అవగాహన సదస్సు
1 min readపల్లెవెలుగు వెబ్, మహానంది:కౌలు రైతులకు అవగాహన సదస్సులు మహానంది మండలంలోని గ్రామాల్లో నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ శాఖ యేవో సుబ్బారెడ్డి బుధవారంబొల్లవరం లో పేర్కొన్నారు .ప్రతి కౌలు రైతు పొలము కౌలుకు తీసుకున్న యజమాని నుండి పట్టాదారు పాసు పుస్తకం తో పాటు కౌలుకు తీసుకున్న వ్యక్తికి సంబంధించిన ఆధార్ కార్డు సెల్ ఫోన్ నెంబరు మరియు కౌలుకు ఇచ్చినటువంటి రైతుకు సంబంధించిన ఆధార్ కార్డు సెల్ ఫోన్ నెంబర్ కౌలుకు తీసుకున్నట్లు ధ్రువీకరణ పత్రం వ్యవసాయ శాఖ గ్రామ స్థాయి అధికారులకు మరియు గ్రామంలోని రెవెన్యూ అధికారులకు సమర్పించాలని సూచించారు .దీనివల్ల కౌలు దారులకు పంట నష్టం జరిగినప్పుడు నేరుగా ప్రభుత్వ ఆర్థిక సహాయ సహకారాలు కౌలు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని ఏవో సుబ్బారెడ్డి రైతులకు తెలిపారు .ఇప్పటికే మండలంలోని 8 ఆర్ బి కె గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు .రెండు రోజుల్లో మిగతా గ్రామాల్లో కూడా రైతులకు అవగాహన కల్పించి కౌలుదారులకు కౌలు కార్డులు అందజేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు .దేవాదాయ శాఖ కు సంబంధించిన భూములుకౌలుకు తీసుకున్నావారి వివరాలు కూడా అందజేస్తే వారికి కౌలు కార్డులు అందజేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు .దీని వల్ల రైతులకు ఎంతో ఉపయోగం ఉంటుందని ఏవో సుబ్బారెడ్డి పేర్కొన్నారు.