PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పిల్ల‌లు కావాలంటూ కోర్టుకు.. కోర్టు ఏం చేసిందంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : న‌్యాయ స్థానం ఎదుట ఓ విచిత్ర కేసు నిలిచింది. నంద్‌లాల్ అనే వ్యక్తి ఓ కేసులో అజ్మీర్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. తమకు పిల్లలు కావాలని, అందుకు తన భర్తను జైలు నుంచి విడుదల చేయాలని అత‌ని భార్య‌ రాజస్థాన్‌ హైకోర్టు జోధ్‌పూర్‌ బెంచ్‌ ముందు పిటిషన్‌ దాఖలు చేసింది. వాదనలు విన్న జస్టిస్‌ సందీప్‌ మెహతా, జస్టిస్‌ ఫర్జాంద్‌ అలీతో కూడిన బెంచ్‌.. ఆమె భావోద్వేగాలని అర్థం చేసుకుంది. రుగ్వేదంతో పాటు అన్ని మతాల్లోనూ ఆడవాళ్లకు పిల్లలను కనే హక్కు ఉంటుందని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. సంప్రదాయాల్ని అమితంగా గౌరవించే మన దేశంలో గృహిణిలకు ఉన్న ప్రథమ హక్కు పిల్లల్ని కనడం అని, కాబట్టి అతనికి పదిహేను రోజుల పెరోల్‌ జారీ చేస్తున్నట్లు ప్రకటించింది.

                               

About Author