94 మంది బిచ్చగాళ్లు అరెస్ట్.. రూ. కోటి స్వాధీనం !
1 min readపల్లెవెలుగువెబ్ : అరబ్ దేశాల్లో భిక్షాటన అనేది నేరంగా పరిగణిస్తారు. ముఖ్యంగా రంజాన్ మాసంలో అక్కడ బిచ్చం ఎత్తి పట్టుబడితే ఇక అంతే. రంజాన్ మాసంలో భిక్షాటన చేసేవారి కోసం అక్కడి ప్రత్యేక పోలీస్ బృందాలు స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తుంటాయి. ఇలా షార్జాలో ఈసారి రంజాన్ మాసం ప్రారంభమైనప్పటి నుంచి 94 మంది బిచ్చగాళ్లను అరెస్ట్ చేసినట్లు షార్జా పోలీసులు వెల్లడించారు. షార్జా పోలీసుకు చెందిన బెగ్గర్ కంట్రోల్ టీమ్ చీఫ్ లెఫ్టినెంట్ కల్నల్ జాస్సీం మహమ్మద్ బిన్ తలైయ్య మాట్లాడుతూ, గడిచిన 10రోజుల్లో 94 మంది యాచకులను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. వీరిలో 65 మంది పురుషులు, 29 మంది మహిళలు ఉన్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి దాదాపు రూ. కోటి స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.