‘మలబార్’… మరో 97 షోరూములు ప్రారంభం: ఎం.పి. అహమ్మద్
1 min readపల్లెవెలుగు వెబ్: మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వ్యాపార వృద్ధిలో భాగంగా ఈ ఏడాది మరో 97 షోరూములు ప్రారంభించనున్నట్లు మలబార్ గ్రూప్ చైర్మన్ ఎం.పి. అహమ్మద్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 2021–22 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.30 వేల కోట్ల టర్నోవర్‌ను సాధించిందని, గత సంవత్సరంతో పోలిస్తే సుమారు 35శాతం వృద్ధి నమోదు చేసిందని వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను రూ.45వేల కోట్ల టర్నోవర్‌ను లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టం చేశారు. ‘‘ మా ఉత్పత్తుల డిజైనింగ్‌లో వినియోగదారుల అభిరుచులకు తగిన ప్రాధాన్యతనివ్వడం వల్లే… కష్టతరమైన సంవత్సరంలో ఈ అరుదైన ఘనతను సాధించాము”అని పేర్కొన్నారు. సామాజిక బాధ్యత కింద ప్రతి ఏటా కంపెనీ తమ లాభాల్లో 5 శాతం ఖర్చు పెడుతుందని వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ సామాజిక సంక్షేమ పథకాలకు రూ.100 కోట్లు ఖర్చు చేయాలని మలబార్ గ్రూప్ నిర్ణయించిందని ఈ సందర్భంగా మలబార్ గ్రూప్ చైర్మన్ ఎం.పి. అహమ్మద్ వెల్లడించారు.