టీసీఎస్ కు లాభాల పంట..!
1 min readపల్లెవెలుగు వెబ్: టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థకు నాలుగో త్రైమాసికంలో భారీ లాభాలు వచ్చాయి. కరోన నేపథ్యంలో అన్ని రంగాల కంపెనీలు నష్టాలు నమోదు చేసినప్పటికీ.. ఐటీ సంస్థలు మాత్రం లాభాల పంట పండిస్తున్నాయి. ఒకరకంగా టెక్ కంపెనీల లాభాలకు కరోన పరోక్ష కారణం అయింది. కరోన నేపథ్యంలో డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవేంతం అయింది. ఫలితంగా టెక్ సర్వీసులకు డిమాండ్ పెరిగింది. దీంతో టీసీఎస్ కూడ మంచి లాభాల్లో నడుస్తోంది. నాలుగో త్రైమాసికంలో ఆ సంస్థ లాభం 14.9 శాతం పెరిగింది. నికర లాభం 9,246 కోట్లకు చేరింది. సంవత్సరం మొత్తం చూస్తే.. నికర లాభం 8,118 కోట్లుగా ఉంది. మూడో త్రైమాసికంలో 8,701 కోట్లుగా ఉన్న నికరలాభం.. నాలుగో త్రైమాసికంలో 9,246 కోట్లకు చేరింది. రెవెన్యూ మూడో త్రైమాసికంలో 42,015 కోట్లు ఉండగా… నాలుగో త్రైమాసికంలో 43,705 కోట్లుగా ఉంది.