PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం

1 min read

పల్లెవెలుగు అన్నమయ్య జిల్లా రాయచోటి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి శ్రీనారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు రాయచోటి నియోజకవర్గ టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది.పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీ ని అంటి పెట్టుకొని వున్న సుగవాసి కుటుంబం,  బుధవారం టీటీడీ  పాలకమండలి మాజీ సభ్యులు శ్రీసుగావాసి ప్రసాద్ బాబు గారి అధ్వర్యంలో వేలాది కార్యకర్తల నడుమ చంద్రబాబు నాయుడు జన్మదినం వేడుకలు ఘనంగా నిర్వహించారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నిండుకుంది.పట్టణానికి చెందిన సీనియర్ మైనర్తీనాయకులు, పలు మండలాల నుంచి విచ్చేసిన పార్టీ కార్యకర్తలు,అభిమానులు తీసుకొచ్చిన కేక్ లను కట్ చేసి తమ ఆనందాన్ని వెలిబుచ్చారు. జన్మదిన వేడుకల లో జై టీడీపీ అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా ప్రసాద్ బాబు మాట్లాడుతూ మనమందరం  సమిష్టిగా కృషి చేసి టీడీపీ కి పూర్వ వైభవం తీసుకోద్ధామని తెలియజేశారు. చంద్రబాబు కు మంచి ఆరోగ్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నానని అన్నారు. చంద్రబాబు నాయుడుగారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని మీ అందరి ఆశీస్సులు ఆయనకు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటూ రాబోయే 2024 ఎలక్షన్స్ లో అత్యధిక సీట్లతో ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని ఈ రాష్ట్రం ఎప్పుడు సుభిక్షంగా ఉండాలంటే ప్రజలందరూ  సుఖసంతోషాలతో ఉండాలంటే చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని అప్పుడే ఈ రాష్ట్రం అభివృద్ధి దిశలో పయనిస్తుందని దానికోసం మనందరమూ కష్టపడి ఇప్పటినుండి తెలుగుదేశం పార్టీ కోసం ఎల్లవేళలా కష్టపడుతూ రాయచోటిలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడానికి మనమందరం కష్టపడి పనిచేయాలని అని నేను కోరుకుంటున్నాను  నాయకులు,కార్యకర్తలు,అభిమానులు అందరూ విరివిగా పాల్గొని  విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను . ఈకార్యక్రమంలో మైనారిటీ నాయకులు మహమూద్,ఖలీల్, ఇర్శాడ్,ఖాదర్ హుస్సేన్,మస్తాన్,ఫరూక్,గౌస్ పీర్,రసూల్ ఖాన్,మదార్,రఫీ,జావేద్,కరమట్,అన్వర్, బాబులు,ఇంతియాజ్, ఖాలక్,వెంకటేశ్వర్లు(చిట్టి),రవీంద్ర నాయుడు,రాంప్రసాద్ నాయుడు,సుందర్ నాయుడు,చెన్నకృష్ణ నాయుడు,రెడ్డిబాబు,రాజ,శేఖర్,సహదేవ,అమర్నాథ్, రెడ్డన్న,శ్రీనివాసులు ,తదితరులు ఆర్టీసీ నాయకులు మాజీ సర్పంచులు,మాజీ ఎంపీటీసీ లు,మాజీ కౌన్సిలర్,విద్యార్థి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author