న్యాయ వ్యవస్థకు పాఠాలు చెబుతారా ?
1 min readపల్లెవెలుగువెబ్ : ‘‘న్యాయవ్యవస్థకు పాఠాలు చెప్పొద్దు. మీరు నిర్ణయం తీసుకోవాల్సిన అంశంపై మమ్మల్ని నిర్ణయం తీసుకోమంటే సాదరంగా ఆహ్వానించబోం’’ అని కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్ట్ మండిపడింది. ఒక అంశంపై నిర్ణయం తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సెక్రటరీ సుప్రీంకోర్ట్‌కు చెప్పజాలరని ఆక్షేపించింది. 1993 బాంబే పేలుళ్ల కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ అబూ సలేం దాఖలు చేసిన పిటిషన్‌ను తొందరపాటు పిటిషన్‌గా కేంద్రం అభివర్ణించడాన్ని జస్టిస్ ఎస్‌కే కౌల్ తప్పుబట్టారు. ఈ అంశంపై నిర్ణయం తీసుకునేందుకు ఇది తగిన సమయం కాదని, సరైన సమయంలో అందుబాటులో ఉన్న పరిష్కారాలను ఎంచుకుంటామని కేంద్ర హోంశాఖ చెప్పడాన్ని న్యాయమూర్తులు ఆక్షేపించారు. కావాలంటే సుప్రీంకోర్ట్ నిర్ణయం తీసుకోవచ్చునని పేర్కొనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.