PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్ర‌భాస్ సినిమాలో అవ‌కాశం.. టాలెంట్ ఉంటే మీ సొంతం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్ లో ప్ర‌భాస్ న‌టిస్తున్న చిత్రం ప్రాజెక్ట్ -కే. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రంలో టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రాజెక్ట్‌లో అవకాశం ఇచ్చేందుకు ఇప్పటికే కొన్ని విభాగాలలో ఆడిషన్స్ పెట్టిన చిత్ర బృందం తాజా మరో టాలెంట్ ఉన్న వారికి అవకాశం ఇస్తున్నట్టు తెలిపారు. ఈసారి స్టంట్స్ వచ్చిన నటుల కోసం చూస్తున్నామని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. భారతీయ కళతో పాటుగా ఇతర మార్షల్ ఆర్ట్స్‌లో టాలెంట్ ఉన్నవారు గానీ లేదా ఆసక్తి ఉన్నవారు ఎవరైనా కూడా తమ టాలెంట్ చూపించి ఈ భారీ చిత్రంలో అవకాశం అందుకోవచ్చని తాజాగా ఇచ్చిన పెట్టిన పోస్ట్‌లో వెల్లడించారు. మరి మీలో ఈ టాలెంట్ ఉన్నవారు మేకర్స్ ఇచ్చిన మెయిల్ ద్వారా సంప్రదించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

                               

About Author