ఎలన్ మస్క్ చేతుల్లోకి ట్విట్టర్ !
1 min readపల్లెవెలుగువెబ్ : ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్ ఇక ఎలాన్ మస్క్ చేతుల్లోకి వెళ్లనుంది. ప్రపంచ కుబేరుడు, టెస్లా కార్ల కంపెనీ వ్యవస్థాపకుడైన మస్క్‌తో ఇప్పటికే చర్చించిన ట్విటర్ బోర్డు.. అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల్లో సోమవారం ట్రేడింగ్ ముగిశాక కంపెనీ విక్రయంపై అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ట్విటర్‌లో 100 శాతం వాటా కొనుగోలు కోసం ఒక్కో షేరుకు 54.20 డాలర్ల చొప్పున మొత్తం సుమారు రూ.3.30 లక్షల కోట్లు చెల్లించేందుకు సిద్ధమని ఈనెల 14న మస్క్ ప్రకటించారు. అంతేకాదు, ట్విటర్ కొనుగోలు కోసం 4,650 కోట్ల డాలర్ల ఫైనాన్స్ ఏర్పాట్లు కూడా చేసుకున్నట్లు ఆయన గతవారంలో వెల్లడించారు.