ఏపీ ఉద్యోగులు.. సీపీఎస్ స్థానే జీపీఎస్ !
1 min readపల్లెవెలుగువెబ్ : రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు సాధ్యమైనంత మేర లబ్ధి చేకూర్చేందుకు రాష్ట్రంలో గ్యారెంటీ పెన్షన్ పథకాన్ని (జీపీఎస్–గ్యారంటీడ్ పెన్షన్ స్కీం) అమలుచేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఈ ప్రతిపాదనను పూర్తిగా పరిశీలించి తగు సూచనలు, సలహాలిస్తే వాటిని పరిగణనలోకి తీసుకుంటామన్నారు. తద్వారా ఉద్యోగులకు సాధ్యమైనంత మేలు చేసేలా దీనిని రూపొందిస్తామని చెప్పారు. పాత పింఛను పథకం (ఓపీఎస్) అమలు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పెద్ద సవాలుగా పరిణమించిందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, భవిష్యత్ తరాల ప్రభుత్వోద్యోగులు, ప్రజల సంక్షేమం దృష్ట్యా పాత పింఛన్ పథకం అమలు దుస్సాధ్యమైన అంశంగా ఉందని చెప్పారు.