కాంగ్రెస్ కు షాక్ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్ !
1 min readపల్లెవెలుగువెబ్ : ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాకిచ్చారు. పార్టీలో చేరాలంటూ సోనియా గాంధీ ఇచ్చిన ఆఫర్‌ను ఆయన తిరస్కరించారు. కాంగ్రెస్‌లో చేరబోనని స్పష్టం చేసిన ఆయన.. కేవలం కాంగ్రెస్‌కు సలహాదారుడిగా మాత్రమే కొనసాగుతానని తెలిపారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో వెలువడిన ఈ ప్రకటన ఆసక్తికరంగా మారింది.