ట్విట్టర్ కు రాజీనామా చేస్తే.. 315 కోట్లు ఇస్తారా ?
1 min readపల్లెవెలుగువెబ్ : ట్విటర్‌ను ఎలన్ మస్క్ కొనుగోలు చేయడం పట్ల సంస్థ సీఈవో పరాగ్ అగర్వాల్ మొదటి నుంచి అసంతృప్తితో ఉన్నారు. తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తపరిచారు. డీల్ పూర్తయ్యాక సోమవారం ఉదయం కూడా మాట్లాడుతూ.. ట్విటర్ పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడంతో.. దాని భవిష్యత్తు అనిశ్చితిలో పడిందన్నారు. మస్క్‌కు ప్రత్యర్థిగా పరాగ్ పేరు వినిపిస్తున్న నేపథ్యంలో ఇకపై ఆయన ట్విటర్‌కు సీఈవోగా కొనసాగుతారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు చెందిన పరాగ్ గతేడాది నవంబర్‌లో ట్విటర్‌కు సీఈవోగా నియమితులయ్యారు. ఒకవేళ పరాగ్‌ను 12 నెలల్లోగా తొలగిస్తే అతనికి సుమారు 315 కోట్ల రూపాయలు సంస్థ చెల్లించాల్సి ఉంటుంది.