ఎలక్ట్రిక్ వాహనాలు పేలుడు ఎందుకో చెప్పిన గడ్కరీ !
1 min readపల్లెవెలుగువెబ్ : లోపాలున్న వాహనాలను తక్షణమే వెనక్కి తెప్పించుకోవాలని ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలను మంగళవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కోరారు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో వేడిమి వల్ల ఈవీ బ్యాటరీలకు సమస్య తలెత్తుతుందన్న మాటా మంత్రి నితిన్ గడ్కరీ నోట నుంచి వచ్చింది. ‘‘దేశంలో ఈవీ పరిశ్రమ ఇప్పుడే మొదలైంది. కాబట్టి ప్రస్తుత పరిణామాల ఆధారంగా ప్రభుత్వం దీనికి అడ్డుకట్ట వేయాలనుకోవట్లేదు. ఈవీలను వాడుకంలోకి తేవాలన్నదే మా సంపూర్ణ లక్ష్యం. కానీ, వాహన దారుల రక్షణ-భద్రతలను ముఖ్యప్రాధాన్యతలుగా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని, ప్రాణాలతో ముడిపడిన విషయం కాబట్టి రాజీ పడే ప్రసక్తే లేద’’ని ఆయన స్పష్టం చేశారు.