టెస్లాకు ఇండియా ఆహ్వానం.. కానీ అలా చేయోద్దు !
1 min readపల్లెవెలుగువెబ్ : ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా కంపెనీ భారత్‌లో సేల్స్ స్టోర్లు ఏర్పాటుకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆహ్వానించారు. కానీ ఆయన ఓ షరతు విధించారు. టెస్లా భారత్‌లో కార్లు తయారు చేసుకోవచ్చు.. వాటిని ఎగుమతి చేసుకోవచ్చు. కానీ చైనాలో తయారైన కార్లను మాత్రం భారత్‌కు దిగుమతి చేయవద్దని ఆయన స్పష్టం చేశారు. చైనాలో తయారైన కార్లను భారత్‌లో విక్రయించడం సబబుకాదన్నారు. ఈ మేరకు మంగళవారం జరిగిన ఓ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు.