ముందస్తు ఎన్నికల పై కొడాలి నాని కీలక వ్యాఖ్యలు !
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీ సీఎం జగన్ తో మంత్రులు, కీలక నేతలు భేటీ అయ్యారు. భేటీ అనంతరం మాజీ మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. “ఏపీలో ముందస్తు ఎన్నికలు ఉండవు. 2024లోనే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయి. ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం జగన్ సర్వేలు చేయించుకున్నారు. 65 శాతం ప్రజలు సీఎం జగన్ తిరిగి ముఖ్యమంత్రి కావాలని సర్వేల్లో తేలింది. సర్వేల్లో కొంత మంది ఎమ్మెల్యేల గ్రాఫ్ తగ్గింది. కొందరు ఎమ్మెల్యేల గ్రాప్ 50 నుంచి 40 శాతం మాత్రమే ఉందని చెప్పారు. ఎమ్మెల్యేలు పనితీరు మెరుగు పరచుకోవాల్సిన అవసరం ఉందని సీఎం ఆదేశించారు. గ్రాప్ పెంచుకోకపోతే వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిని మార్చుతామని సీఎం చెప్పారు. సీఎం ఇచ్చిన మరో అవకాశాన్ని ఎమ్మెల్యేలు అందరూ వినియోగించుకోవాలని’’ కొడాలి నాని అన్నారు.