అక్రమ లేఅవుట్ల పై ఉక్కు పాదం: ఆర్డీఓ రంగస్వామి
1 min readపల్లెవెలుగు అన్నమయ్య జిల్లా రాయచోటి: రాయచోటి పట్టణ పరిధిలోని అక్రమ లే ఆవుట్లు మరియు అనుమతులు పొందని లే ఆవుట్లపై ఉక్కుపాదం మోపుతామని రాయచోటి రెవెన్యూ డివిజనల్ అధికారి రంగస్వామి హెచ్చరించారు. బుధవారం స్థానిక ఆర్ డి ఓ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయచోటి పట్టణ శివారు లోని అక్రమ లేఅవుట్లు మరియు అనుమతులు పొందని పట్టా భూముల ఇండ్ల స్థలాలు (వ్యవసాయ భూమి నుండి వ్యవసాయేతర భూమి గా మారని) రిజిస్ట్రేషన్ జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. అదేవిధంగా అక్రమ లేఅవుట్లు పై ప్రణాళిక కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అధికారులు పక్క గా చర్యలు తీసుకోవాలని లేని యెడల క్రమశిక్షణచర్యలుతీసుకొంటామన్నారు.. ప్రతి లేఅవుట్ ప్లానింగ్ అనుమతులు, మరియు కన్వర్షన్ లేఅవుట్ అనుమతులు పొందితీరాలని తెలియచేశారు. ఈ కార్యక్రమము లో మున్సిపల్ కమిషనర్ రాంబాబు తహశీల్దార్ శ్రీ సుబ్రహ్మణ్యం రెడ్డి రాయచోటి సబ్ రిజిస్టర్ గురుస్వామి , రాయచోటి పట్టణ ప్రణాళిక అధికారి తదితరులు, పాల్గొన్నారు.