ఉపాధి కూలీలకు వసతులు కల్పించలేక పోతున్నాం: ఎంపీడీఓ
1 min readపల్లెవెలుగువెబ్, మహానంది: కర్నూలు జిల్లా మహానంది మండలంలోని ఉపాధి కూలీలకు కల్పించాల్సిన వసతులు కల్పించలేక పోతున్నామని ఇన్చార్జి ఎంపీడీవో సుబ్బరాజు పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో కొంతవరకూ ఉపాధి కూలీలకు వారి అవసరాల నిమిత్తం గడ్డపారలు ,ఇతర తవ్వకానికి ఉపయోగించే వస్తువులు ఇచ్చారని, ప్రస్తుతం వాటి వివరాలు తమ వద్ద లేవన్నారు. ఉపాధి కూలీలకు వచ్చే వారికి మంచినీరు.. వారి పిల్లలరక్షణ కోసం ఉపయోగించే టార్పాలిన్లు గత ప్రభుత్వంలో ఇచ్చారు కానీ నేడు అలాంటివి ఏమీ లేవు అన్నారు. గత మూడు సంవత్సరాల నుంచి ఉపాధి హామీ కూలీలకు సంబంధించి అందించాల్సిన ఎలాంటి పరికరాలు పనిముట్లు ప్రభుత్వం విడుదల చేయలేదన్నారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఉపాధి హామీ ఈ పథకం మొత్తం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నికి వెళ్లిందని కేంద్ర ప్రభుత్వం కూడా వారికి ఇలాంటి వసతులు కనీసం తాగునీరు సౌకర్యం కూడా కల్పించలేదని ఎంపీడీవో సుబ్బరాజు పేర్కొన్నారు సాఫ్ట్వేర్ మార్పులో భాగంగా ఉపాధి కూలీలకు తగిన వసతులు ఏప్రిల్ 1 నుంచి కల్పించలేక పోతున్నట్లు ఇంచార్జి ఎంపీడీవో సుబ్బరాజు పేర్కొన్నారు.