ఏకలవ్య పాఠశాల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
1 min read
పల్లెవెలుగువెబ్ : కేంద్ర గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పాడేరు ఐటీడీఏ పరిధిలోని 11 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రవేశాలకు గాను దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ఐటీడీఏ పీవో ఆర్.గోపాలకృష్ణ తెలిపారు. సీబీఎస్‌ఈ ఇంగ్లీష్ మీడియంలో బాలబాలికలకు కో ఎడ్యుకేషన్ పద్ధతితో విద్యాబోధన ఉంటుందని ఆయన వివరించారు. ప్రతి తరగతికి 60 సీట్లు చొప్పున బాలికలకు 30, బాలురకు 30 కేటాయిస్తున్నామని ఆయన వివరించారు. 2022–23 విద్యాసంవత్సరానికి సంబంధించి జి.కె.వీధి, డుంబ్రిగుడ(అరకు సంతబయలు), చింతపల్లి, ముంచంగిపుట్టు(పెదబయలు), అనంతగిరి, అరకులోయ, హుకుంపేట(పాడేరు), పెదబయలు, పాడేరు, జి.మాడుగుల, కొయ్యూరులోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రవేశాలు కోరుతున్నామన్నారు. 6వ తరగతిలో ప్రవేశాలకు గాను 5వ తరగతి పాసైన విద్యార్థిని, విద్యార్థులు ధరఖాస్తులు చేసుకోవాలన్నారు.