మోదీని ఓడించడం కాదు.. దేశాన్ని గెలవండి !
1 min readపల్లెవెలుగువెబ్ : ‘‘ప్రధాని నరేంద్ర మోదీని ఓడించడం కాదు.. దేశాన్ని గెలవండి!’’ అని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏవిధంగా పుంజుకోవాలో ఆయన సమగ్రంగా వివరించారు. గత పక్షం రోజుల్లో దాదాపు వారంపాటు కాంగ్రె్‌సతో సుదీర్ఘ చర్చలు జరిపిన పీకే.. 2024 ఎన్నికల నాటికి కాంగ్రెస్ భవిష్యత్తు ఎలా ఉండాలనే అంశంపై తన వ్యూహాన్ని పార్టీ తాత్కాలి క అధ్యక్షురాలు సోనియా గాంధీ సహా కీలక నేతలతో పంచుకున్నారు. కాంగ్రెస్ లో చేరాలని అనుకున్నా.. అనివార్య కారణాలతో ఆయన ఈ ప్రతిపాదనను విరమించుకున్నారు. ఇదిలావుంటే, తాజాగా బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పీకే.. కాంగ్రెస్ విషయంలో తను ఏం చేసిందీ చెప్పుకొచ్చారు. ‘‘కాంగ్రెస్ తన పూర్వవైభవాన్ని ఎలా పొందాలనే విషయంపై బ్లూప్రింట్ రూపొందించా. ఇది ఒకటో, రెండో ఎన్నికల్లో విజయం దక్కించుకునేలా రూపొందించింది కాదు. దేశంలో బలమైన రాజకీయ శక్తిగా కాంగ్రెస్ పునరుత్తేజం పొందడానికి దోహదపడుతుంది’’ అని పీకే వివరించారు.